telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.. ఎందుకు తిట్లు పడాలి?: కేసీఆర్

Woman candidates kcr cabinet Telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం కొత్త మునిసిపల్ చట్టంఅమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, ఎందుకు తిట్లు పడాలని ప్రశ్నించారు.

కార్పొరేషన్లు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. పట్టణాలు, నగరాల అభివృద్ధిపై అర్బన్ పాలసీ రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలోనే, తెలంగాణ స్టేట్ అడ్మినస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. జిల్లాతో పాటు మండల పరిషత్‌లకు విధుల్లో స్పష్టత ఇవ్వాలని సమీక్ష సమావేశంలో కేసీఆర్ సూచించారు.

Related posts