telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్‌పై స్కిట్.. బండి సంజయ్‌కి పోలీసుల నోటీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్సుడు బండి సంజయ్‌‌కు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో  ఉద్యమ ఆకాంక్షల సాధన సభను జిట్టా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో  సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన ప్ర‌ద‌ర్శించార‌ని టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ వై స‌తీశ్ రెడ్డి హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న‌లను అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా..బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హయత్ నగర్ పోలీస్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్‌పై జిట్టా బాలకృష్ణ విడుదల అయ్యారు.

Related posts