telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పసుపు రైతులు రాజకీయ నాయకుల వలలో పడొద్దు: ఎంపీ అరవింద్

aravind bjp mp

పసుపు రైతులు రాజకీయ నాయకుల వలలో పడొద్దని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

పసుపు రైతుల కోసం ప్రతి ఏడాది రూ.100 నుంచి రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్నామని తెలిపారు. ఇకపై రైతులకు సీడ్, ఎరువులు, అమ్మకం, కొనుగోలు, ఇన్సురెన్స్, క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని, పసుపు బోర్డు కన్నా మంచి స్కీం పసుపు రైతులకు అందిస్తామన్నారు. పసుపు రైతులు రాజకీయ నాయకుల వలలో పడొద్దని సూచించారు. ఆంధ్రలో జగన్ పసుపుకి మద్దతు ధర ప్రకటించినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

Related posts