ఒకపక్క ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుంటే, మరో పక్క అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండతుంది వాతావరణ శాఖ. అనడానికి అకాల వర్షాలైనప్పటికీ, ఉన్న ఎండలను పెంచడానికే ఈ ఎండలు..ఇది కూడా ప్రకృతి గిఫ్తే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, ఈ వర్షాల అనంతరం మరింతగా ఎండ పెరగనుంది. మార్చి నెలలోనే ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే బయపడిపోతున్నారు.
వాతావరణ శాఖ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అంటుంది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీనితో ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాసింత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.