telugu navyamedia
ఓటు తెలంగాణ వార్తలు రాజకీయ

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ- మల్లు భట్టి విక్రమార్క

హనుమకొండ జిల్లా: లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదుపలేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్- బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ?.. అలాగే ఎంఐఎం (MIM), బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలకు బీజేపీతో ఉన్న అవగాహన ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST)లకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు  కల్పించిందని, ఇప్పుడు వాళ్లు రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని మండిపడ్డారు.

జనగణనను వెంటనే మొదలు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్‌ను తీసుకురావాలని కోరుతున్నామన్నారు. రూ. రెండు లక్షల 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి.. 54 శాతం ఉన్న బీసీలకు ఐదు శాతం బడ్జెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

Related posts