నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలు, రైతులకు అన్ని వేళలా అండగా ఉంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మాజీ ప్రధాని, స్వర్గీయ చౌదురీ చరణ్ సింగ్ రైతుల కోసం చేసిన ఉద్యమాలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అలాంటి రైతు బాంధవుని జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు.
ఆపై, “సమాజానికి అన్నం పెట్టే రైతు ఋణం తీర్చుకోడానికి, గత ఐదేళ్ళ తెదేపా హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలు వేసి, రైతు ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మాది రైతుపక్షమే. అన్నివేళలా మీకు తెదేపా అండగా ఉంటుందని ఈ రైతు దినోత్సవ వేళ మరోసారి గుర్తుచేస్తున్నాను” అని మరో ట్వీట్ పెట్టారు.
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం లేదు: రేవంత్ రెడ్డి