telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అవినీతి చెప్పగా.. తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ .. 20కోట్ల ఆస్తి గుర్తింపు..

acb ride on mannem lakshminarasimham

అవినీతి నిరోధక శాఖ అధికారులు నెల్లూరు జిల్లా రాపూరు తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మన్నెం లక్ష్మీనరసింహం ఇంటిలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 7 ఇళ్ల స్థలాలు, నెల్లూరు జిల్లా పరిధిలోని బోగసముద్రం ప్రాంతంలో 14 ఎకరాల వ్యవసాయ భూమి, నగరంలో రెండంతస్తుల భవనం, కావలిలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌, రూ.4 లక్షలు నగదు, 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేసి గుర్తించిన ఆస్తి విలువ మార్కెట్‌ ధర ప్రకారం దాదాపుగా రూ.20 కోట్లకుపై మాటేనని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందిన సమాచారం మేరకు..ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో ఎసిబి అధికారులు దాడులు చేశారు. నెల్లూరుతో పాటు కావలి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలలో మొత్తం 6 ప్రాంతాల్లో ఆ అధికారికి సంబంధించిన స్నేహితులు, బంధువుల ఇళ్లపై ఏక కాలంలో సోదాలు ప్రారంభించారు.

ఈ సోదాల్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, నగదు బయటపడ్డాయి. ఈ దాడులు అవినీతి నిరోదక శాఖ డిఎస్‌పి సిహెచ్‌. డి.శాంట్రో, నెల్లూరు ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు, తిరుపతి ఇన్‌స్పెక్టర్‌ విజయశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 1995లో నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రాంతంలో రెవెన్యూ విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా, 2004లో జలదంకి, వెంకటగిరి, బాలాయపల్లి ప్రాంతాలకు తహశీల్దార్‌గా విధులు నిర్వహించారు. ఉద్యోగోన్నతి కల్పించి కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో ప్రత్యేక విభాగానికి ఆర్‌డిఒగా పనిచేశారు. అక్కడి నుంచి బదిలీపై 2014 -2017 మధ్య కాలంలో కావలి ఆర్‌డిఒగా పనిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాపూరు ప్రాంతంలో తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెసి-2గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాను విడిచి చిత్తూరుకు వెళ్లాల్సి ఉంది. ఈలోగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేయడంతో అసలు విషయం బయటపడింది.

Related posts