డీటీహెచ్, కేబుల్ టీవీల వినియోగదారులకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) శుభవార్త చెప్పింది. రెండు నెలలపాటు నాలుగు చానళ్లు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సోనీపాల్, స్టార్ ఉత్సవ్, వయాకామ్ 18, కలర్స్ రిలేషన్‌షిప్ చానళ్ల అన్ని రుసుములను రెండు నెలలపాటు మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ఐబీఎఫ్ తెలిపింది.
డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా, కరోనా వైరస్ కారణంగా టీవీ పరిశ్రమ దారుణ పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఐబీఎఫ్ తెలిపింది.
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని