telugu navyamedia
రాజకీయ

రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌పై కొత్త‌ వివాదం

*రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌పై కొత్త‌ వివాదం
బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడుతాం
145 రోజుల్లోచ‌ర‌మ‌గీతం పాడుతామ‌న్న‌పోస్ట‌ర్ విడుద‌ల‌
కాంగ్రెస్ విడుద‌ల చేసిన పొస్ట‌ర్ పై అభ్యంత‌రాలు

భారత్ జోడో యాత్రలో సరికొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో ఓ వివాదాస్ప‌ద పోస్టును పార్టీ పోస్టు చేసింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్య‌కర్తలు ధ‌రించే ఖాకీ నిక్క‌ర్ కాలుతున్న ఫోటోకు ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది ఆ పార్టీ. ఇంకా 145 రోజులు ఉన్నాయంటూ ఆ ఫోటోకు క్యాప్షన్‌ను జోడించింది.

ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ నుంచి కూడా విముక్తి పొందేందుకు, ఒక్కొక్క అడుగు వేసి ల‌క్ష్యాన్నిచేరుకోనున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. అయితే దీంతో కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌పై ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు

ఆ పోస్టును వెంట‌నే తొల‌గించాల‌ని బిజెపి డిమాండ్ చేస్తుంది. ఈ సంద‌ర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, అందుకే ఇలాంటి వివాదాస్ప‌ద ట్వీట్ చేసింద‌ని విమ‌ర్శించారు. ఇది భార‌త్ జోడో యాత్ర కాద‌నీ,  నిజానికి అగ్నిమాపక యాత్ర.. అని విమ‌ర్శించారు. రాహుల్ యాత్ర‌ను  ‘ఇండియా బ్రేక్ యాత్ర’గా అభివర్ణించారు. ఈ  పోస్టును కాంగ్రెస్‌ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.  ఇది కాంగ్రెస్‌ ‘బర్న్‌ ద ఫైర్‌ ఉద్యమం’ అని బీజేపీ పేర్కొంది.

Related posts