ఈరోజు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో బీజేపీ తరుఫున నుంచి చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటుంది. మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం పదవి కూడా రాజీనామా చేశారు తమిళిసై. గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించిన ఆమె ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారట.
తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి బరిలో దిగేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వస్తూన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తూత్తుకూడి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి చవిచూశారు. 2006 నుంచి తమిళిసై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంత వరకూ ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోలేకపోయారు.
అందుకే అసదుద్దీన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్