telugu navyamedia
రాజకీయ సామాజిక

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ..

దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదర, సోదరీ మణుల ప్రేమకు చిహ్నమైన ఈ రాఖీ పండుగను అంతే ప్రేమతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం రోజున.. ప్రతీ సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుతారు.

Raksha bandan 2020: రాఖీ పండుగ తో పాటు శ్రావణ పౌర్ణిమ కు ఎన్ని ప్రత్యేకతలో! | Raksha bandhan 2020 so many specialities are there in rakhi pournima festival

అలాగే.. ప్రతీ సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటానని భరోసా ఇస్తారు హిందూ పండగల్లో రాఖీ పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ.  రాఖీ రోజు ఉద‌యాన్నే త‌లార స్నానం చేసి, కొత్త బ‌ట్ట‌లు వేసుకుని రాఖీకి సిద్ధ‌ప‌డ‌తారు. అక్క‌చెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్న‌ద‌మ్ములకి రాఖీని క‌డ‌తారు. 

రక్షాబంధన్-రాఖీ పండుగ- Raksha Bandhan Speech - MEGA MINDS

చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు. ఈ పండగను శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు.

ఈ ఏడాది ఆగస్టు 22న రాఖీ వచ్చింది. ఈ రోజు ఉదయం 6.19 గంటల నుంచి సాయంత్రం 5.31 గంటల వరకు రాఖీ కడితే మంచిదని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇచ్చి గౌరవిస్తారు.

rakhi 2020: శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో ఇలా జరుపుకుంటారు - date and time of raksha bandhan, when is celebrates jandhyala purnima in telugu states ...

అంతేకాదు ఇతిహాసాల ప్రకారం.. ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు.

Raksha Bandhan: जब द्रौपदी की लाज बचाने दौड़े चले आए श्रीकृष्ण, दिया था ये वचन | News Track in Hindi

అలాగే.. మ‌న‌ దేశాన్ని క‌పాడుతూ ప్రజలందరూ ర‌క్ష‌ణ ఇస్తున్నందుకు పోలీసుల‌కు కాలేజ్ అమ్మాయిలు ఈ రోజు రాఖీ క‌డ‌తారు.

Related posts