telugu navyamedia
రాజకీయ

మోదీ సర్కారు నిరుద్యోగుల సంఖ్యను దాచిపెడుతోంది: చిదంబరం

మోదీ సర్కారు పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించారు.తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెడుతున్న తరుణంలో చిదంబరం స్పందించారు. ఓవైపు దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంటే, వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఎలా నమోదయిందని ప్రశ్నించారు. జీడీపీ అంచనాలను పెంచుతున్న మోదీ సర్కారు, నిరుద్యోగుల సంఖ్యను దాచి పెడుతోందని ఆరోపించారు. 
ఈరోజు చిదరంబరం ట్విట్టర్ లో స్పందిస్తూ..’సగటున 7 శాతం కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు.మేము కూడా అదే అడుగుతున్నాం.. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాలి? పెద్ద నోట్ల రద్దు జరిగిన 2016లో అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయింది. ఈ సారి రూ.100 రూపాయల నోట్లను కూడా రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతోందని విమర్శించారు.

Related posts