telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్మీలో మరో కుంభకోణంలో .. కీలక ముందడుగు..

vest helicopters scam investigation

నాణ్యత ఎక్కడ ఉన్నా లేకున్నా రక్షణ వ్యవస్థలో తప్పని సరిగా తగిన ప్రమాణాలు పాటించాలి. కానీ, రాజకీయ నాయకుల స్వార్థం తారాస్థాయికి చేరడంతో వారి ఆగడాలు రక్షణ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేట్టుగా తయారయ్యాయి. దానితో అనేక కుంభకోణాలు జరగటం, వాటిపై అనేక ఏళ్లగా దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తాజాగా, వెస్ట్ లాండ్ హెలికాప్టర్స్ కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగుపడినట్టుగా తెలుస్తుంది. ఈ కుంభకోణం విలువ 3600కోట్లు. ఇప్పటికే రాఫెల్ ఒప్పందం గురించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈకేసులో నిందితులు దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్‌ సక్సేనా, కార్పొరేట్‌ లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. వారిద్దరినీ గురువారం తెల్లవారుజాముల స్వదేశానికి తీసుకొచ్చారు. ఈకేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సక్సేనా, తల్వార్‌లను అప్పగించనున్నారు. ఇటీవలే ఈ కుంభ కోణం కేసులో సహ నిందితుడు,మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను దుబాయి నుంచి తీసుకొచ్చి అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అగస్టా వ్యవహారంలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈడి అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈకేసు దర్యాప్తు నిమిత్తం సక్సేనాకు ఈడి అనేకసార్లు సమన్లు పంపింది. గతేడాది జూలైలో సక్సేనా భార్య శివాని సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇక దీపక్‌ తర్వాల్‌పై కూడా అవినీతి, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.

Related posts