telugu navyamedia
సినిమా వార్తలు

“నా డ్యాష్…” అంటూ మనోజ్ ట్వీట్… నెటిజన్లు ఫైర్

Manchu Manoj

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “కియా మోటార్స్” తాయారు చేసిన మొదటి కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ ను ఎందుకు తొలగించారంటూ నెటిజన్లు మంచు మనోజ్ ను ప్రశ్నించారు. తన స్నేహితుడి కారణంగా ఆ ట్వీట్ ను డిలీట్ చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు. మళ్ళీ కాసేపటికే ఈ ట్వీట్ ను కూడా డిలీట్ చేశారు. దీంతో మనోజ్ ఎందుకలా ట్వీట్లు డిలీట్ చేస్తున్నావంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ ట్రోలింగ్ పై మంచు మనోజ్ స్పందిస్తూ ”నేను పెట్టిన ట్వీట్ డిలీట్ చేశాననుకునే ప్రతీ ఒక్కరికీ… ‘నా ఇష్టం’. నేను ఎవరి కారణంగానో ప్రభావితమై ట్వీట్ డిలీట్ చేశానని భావించే వారందరికీ.. నా డ్యాష్ (ఎవరికీ అంత బొమ్మ లేదు).. నేను నిజాయితీగా ఉన్నానని భావించే ప్రతి ఒక్కరికీ.. “వెధవలని లైట్ తీసుకోండి” (పాపం వాళ్లూ మన భారతీయులే” అంటూ ట్వీట్ చేశారు. ఓ సెలబ్రిటీ అయిన మంచు మనోజ్ ఇలా అసభ్యకర పదజాలం వాడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related posts