telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారతీయులనే ముందు .. నియంత్రించాలి..: ట్రంప్

indian h1b visa rejections

అమెరికాలో స్థిరపడాలి అనే వారిలో భారతీయులే చాలా ఎక్కువ .. ఈ విషయాన్ని గణాంకాలు కూడా చెబుతున్నాయి. ట్రంప్ మాత్రం పదే పదే భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఆయన మరోసారి భారతీయ యువతకు షాక్ ఇచ్చారు. 2017 లో తీసుకు వచ్చిన కొత్త చట్టంవల్ల హెచ్ ఒన్ బి వీసాలు భారత్ కు మంజూరు అవడం బాగా తగ్గిందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రకటించింది. అమెరికాలో స్థానిక వ్యాపారాలు పెంచడానికి ఆయన ఈ చట్టం తీసుకువచ్చారు. దీని ప్రభావం భారత్ పై ఎక్కువగా పడిందట. రెండేళ్లలో భారతీయ కంపెనీలు పొందే హెచ్ -1 బీ వీసాల్లో గతంతో పోలిస్తే బాగా తగ్గాయని ఆ సంస్థ తెలిపింది.

తొలి పది స్థానాల్లో ఉండే భారతీయ సంస్థలు 2016 లో 51 శాతం వీసాలు పొందగా .. 2019 కి వచ్చేనాటికి ఆ మొత్తం 24 శాతానికి పడిపోయిందని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కూడా వెల్లడించింది. భారతీయులకు జారీ చేసిన హెచ్ -1 బీ వీసాల్లో చాలా వరకు అమెరికా కంపెనీలు వెళ్లాయి. అతి తక్కువ మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్లాయి. అమెరికా కంపెనీలు దరఖాస్తు చేసిన వాటిల్లో 99 శాతం వీసాలు వచ్చాయని ఈ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.

Related posts