ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ ధ్యాసలో పడి అమాంతం వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. సదరు వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌పై నడుస్తున్న విషయం కూడా మరిచిపోయి పూర్తిగా ఫోన్‌లో నిమగ్నం కావడంతో ఇలా జరిగిందని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఆ వ్యక్తిని తిరిగి ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగేయడంతో ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన వ్యక్తిని రైల్వే సిబ్బంది స్ట్రెచర్‌పై అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. ఈ సంఘటన బ్యూనస్ ఎయిర్స్‌లోని డి లైన్, అగ్యురో స్టాప్‌లో ఈ నెల 13వ తేదీన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Video Source: RT
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా