telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో పిటీషన్

Raghuramakrishnaraju ycp mp

రఘురామ కృష్ణ రాజు కుమారుడు కె. భరత్ సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సిబిఐ, లేదా “సిట్” తో విచారణ జరపాలని కోరుతూ రిట్ పిటీషన్ దాఖలు చేశారు కె. భరత్. ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, ఏపి ప్రభుత్వం, ఏపి హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపి సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.వి. సునీల్ కుమార్, మంగళగిరి పోలిస్ స్టేషన్ ఆఫీసర్, ఏపి సి.ఎమ్ జగన్మోహన్ రెడ్డి, సిఐడి అడిషనల్ ఎస్.పి ఆర్. విజయ్ పాల్ ను పిటీషనర్ పేర్కొన్నారు. పిటీషనర్ కె.భరత్ దాఖలు చేసిన పిటీషన్ లో తన తండ్రి రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో ఉండగా “కొట్టారని” పేర్కొంటూ, సిబిఐ కానీ, “సిట్” ( ప్రత్యేక దర్యాప్తు బృందం) తో గానీ విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పిటీషనర్ అభ్యర్థించారు. ఈ పిటీషన్ పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గవైలతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరుగనుంది. అటు గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపారు రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదలైనట్లేనని..విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని..అందుకే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు రఘురామ న్యాయవాది దుర్గాప్రసాద్. హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి వాట్సప్ లో నోటీసులు పంపారు దుర్గాప్రసాద్.

Related posts