టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విండీస్ టూర్‌కు ప్రకటించిన జట్టుకు కూడా కోహ్లీని కెప్టెన్‌గా చేయడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు. ఒక్క మీటింగ్ కూడా నిర్వహించకుండా సెలెక్టర్లు ఎలా కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశారని గవాస్కర్ ఓ కథనంలో ప్రశ్నించాడు.
సెలక్షన్ కమిటీకి నచ్చినట్లుగా కోహ్లీ ఉన్నాడని అతన్నే కెప్టన్ గా కొనసాగిస్తున్నారని ఆ కథనంలోనే గవాస్కర్ విమర్శించాడు. వరల్డ్‌కప్ వరకే మొదట కోహ్లీని కెప్టెన్‌గా ఎన్నుకున్నారు, కానీ ఆ తర్వాత కూడా అతన్ని కొనసాగించాలన్నా కనీసం కొన్ని నిమిషాలైనా సెలెక్షన్ కమిటీ సమావేశం అయ్యి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని గవాస్కర్ వినిపించాడు. సెలెక్టర్లు ఉత్తబోమ్మలే అని సునిల్ విమర్శించాడు
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు