కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని రష్యా అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్‌పై అధికారికంగా ప్రకటన చేశారు. తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటన చేశారు. ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు.
తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. కరోనా వ్యాక్సిన్‌ను ఈ రోజు ఉదయమే రిజిస్టర్ చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేయించిన తొలి దేశం తమదేనని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.