telugu navyamedia
వార్తలు

గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా ..

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఈ మేర‌కు శనివారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. 2016 నుంచి గుజ‌రాత్ సీఎంగా విజ‌య్ రూపానీ కొన‌సాగుతున్నారు. ఇటీవలే సీఎంగా విజయ్ రూపానీ ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నేపథ్యంలో సీఎం విజ‌య్ రూపానీతో పార్టీ అధిష్టానం రాజీనామా చేయించింది. కొత్త ముఖ్య‌మంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు సమాచారం.

Gujarat: Is BJP top brass trying to clip wings of CM Vijay Rupani? - The Week

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతలు సమయానుకూలంగా మారుతుంటాయని అన్నారు.‘‘ఒక సాధారణ కార్యకర్త అయిన నాకు ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాను’’ అని రూపానీ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ప్రత్యేక మార్గనిర్దేశనం లభించేదని చెప్పారు.

‘‘గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు అవకాశం కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు’’ అని రూపానీ అన్నారు. ‘‘కొత్త నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో, సరికొత్త ఉత్సాహంతో గుజరాత్ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలి. ఈ ఉద్దేశ్యంతోనే నేను రాజీనామా చేశాను’’ అని వెల్లడించారు.

Related posts