ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక నిన్ననే రఘురామకృష్ణరాజును గుంటూరు జైల్లో ఉంచారు సీఐడీ అధికారులు. అయితే తన భర్త అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసారు. అందులో ”నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారుఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే డబ్బు కట్టాలా?: చంద్రబాబు