telugu navyamedia
ఆరోగ్యం

మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం

*ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తక్కువ ధరలో కూడా మనకు దొరుకుతుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.

*కానీ ఉసిరిని తగుమోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఉసిరిని ఆహారంలో కొద్ది భాగంగానేతీసుకోవాలి ఇష్టం వచ్చినట్లు తినకూడదు.

*మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. ఉసిరి నూనె తలపోటుని నిరోధించి,మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది.

*ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా హరిస్తుందని కొందరు జ్యోతిష, వాస్తు శాస్త్రజ్ఞలు చెప్తున్నారు.

*శరీరం పటుత్వం కోల్పోకుండా, బలంగా ఉండాలంటే ఉసిరి తినాల్సిందే. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎండబెట్టిన ఉసిరిపండ్ల చూర్ణంలో పసుపు ఒక గ్రాము, తేనె ఒక గ్రాము వేసుకొని రోజూ తింటే, షుగర్ వ్యాధి దూరమవుతుంని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

*శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం మొదలైన వాటి సమస్యలకు తగ్గించడానికి ఉసిరి ఎంతగానో దోహదపడుతుంది. ఉసిరిలో ఉండే ఫైబర్ వల్ల పేగు కదలికలు మెరుగుపడి, జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది.

*కంటి బాధలు ఉన్నవారు ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీస్పూన్ తేనె కలిసి తాగితే రోజూ తాగితే ఆ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

*ఎండబెట్టిన ఉసిరికాయతో బెల్లం కలిసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆస్త్మా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

*ఉసిరి కాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరిన్‌లో మంటను పోగొడుతుంది.

*ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు తగ్గించడానికి కూడా ఉసిరికాయ రసం ఎంతగానో తోడ్పడుతుంది.

*మొటిమల నివారణకు కూడా ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.

*ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

Related posts