తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం తిరుమలలో శ్రీ వారిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. స్వామి వారి సన్నిధిలో అన్యమత ప్రచారం, ప్రార్థనలను జరపకూడదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ అభివృద్ది జరగాలలని తాను తిరుపతి వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అనువైన రాష్ట్రమని సోము వీర్రాజు తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే కరోనా లాంటి విపత్తు నుండి దేశ ప్రజలను కాపాడి ఆయురారోగ్యలను ప్రసాదించిన కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలను చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించానని సోము వీర్రాజు తెలిపారు
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు