telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

హైకోర్టులో నిమ్మగడ్డకు ఊరట…

Nimmagadda ramesh

ఈరోజు హై కోర్టులో పంచాయితీ ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. కరోనా నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా కరోనా కారణంతో తక్కువ పోలింగ్ జరిగిందని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆరువేల మంది చనిపోయారని వాదించారు. అయితే హై కోర్టు ఆదేశాల మేరకే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని ఎన్నికల కమిషనర్ న్యాయవాది అశ్వనీ కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకునే అధికారం కమిషనర్ కు ఉందని న్యాయవాది వాదించారు. ఎన్నికల నిర్వహణ పై సుప్రీంకోర్టు, హై కోర్టు తీర్పులను తమ ముందు ఉంచాలని హై కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రకటన పై స్టేటస్ కో అడిగిన ప్రభుత్వం..నిరాకరించిన హై కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తామని నవంబర్ 17న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచిన  ప్రొసిడింగ్స్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. మరి రేపు ఈ కేసులో ఏమి నిర్ణయం వెలువడుతుందో చూడాలి. 

Related posts