telugu navyamedia
రాజకీయ

సీఎం ఏక్‌నాథ్ షిండేను స‌స్పెండ్ చేయండి.. రెబెల్స్ పై సస్పెన్షన్

మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కోరుతూ శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటీష‌న్‌ దాఖలు చేసింది.

శివ‌సేన చీఫ్ విప్ సునిల్ ప్ర‌భు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 16 మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకొనే వరకు ఈ సస్పెన్షన్ ను కొనసాగించాలని ఆ పిటిషన్ లో శివసేన ఆ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.

జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్‌ను విచారించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు పెండింగ్‌లో ఉంద‌ని, త‌క్ష‌ణ‌మే ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ కోర్టును కోరారు. ఈ నేప‌థ్యంలో ఆ కేసులో జూలై 11న విచార‌ణ చేప‌ట్టేందుకు కోర్టు అంగీక‌రించింది.

ఈ నెల 29న రాత్రి ఏడున్నర గంటలకు ఏక్‌నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. రేపటి నుండి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో శివసేన ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.

Related posts