telugu navyamedia
రాజకీయ

నాకో ప్రేమ లేఖ అందింది : ఐటీ నోటీసుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఆదాయపు విభాగం నుంచి నోటీసులు గురువారం రాత్రి వచ్చాయి. ఆ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా విమర్శలు గుప్పించారు.

నాకు ఒక ప్రేమ లేఖ అందింది… 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని తాజాగా పరిశీలిస్తున్నారట. అందుకే తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసు ఇచ్చారు.

విభిన్న భావజాలం ఉన్న వ్యక్తులపై ఇలా ప్రభుత్వ సంస్థలను ప్రయోగించడం సాధారణమైందని విమర్శించారు. ఈ విషయమై స్పందిస్తూ ఆయన గురువారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.

అయితే ఇందులో తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని తెలిపారు. చాలా సంవత్సరాల సమాచారాన్ని సేకరించడం, నిర్దిష్ట వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది అని ప‌వ‌ర్ అన్నారు.

అయితే, ఈ నోటీసులపై ఎన్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే.. మా పార్టీ అధ్యక్షుడికి ఐటీ నోటీసులు వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనుక ఇంకేమైనా ఉందా?’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

Related posts