telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐటీఐఆర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: మంత్రి కేటీఆర్‌

ktr trs president

బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేం చేసుకుంటూ పోతున్నామన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం బెంగళూరును దాటిపోయిందని మంత్రి స్పష్టం చేశారు. ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్‌ బెంగళూరును దాటిపోయింది.

అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టే 17 శాతం వృద్ధిరేటు సాధ్యమైంది. ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడే కంటే ముందు ఐటీ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్‌, ఆపిల్‌, గూగుల్‌, అమెజాన్‌.. బెంగళూరు కాదని హైదరాబాద్‌కు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సమర్థత వల్లే ఆ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్‌ఐపాస్‌ ద్వారా సృష్టించామన్నారు.

Related posts