telugu navyamedia
సినిమా వార్తలు

ఒంటి కాలిపై నడుస్తూ స్కూల్ కు..చ‌లించిపోయిన కేటీఆర్ .

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారు యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఓవైపు మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడుతూనే.. మరోవైపు సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి చేయూతనిస్తూ ఉంటారు.

ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్‌ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు.

తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్‌.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే..

 బీహార్‌లోని సివాన్‌ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్‌ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

బిహార్‌ సివాన్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ను చూసి…. ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. తన వంతుగా ఆమెకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Related posts