హాస్య నటుడు, వైసీపీ నేత అలీ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ అలీ కూడా కౌంటర్ ఇచ్చాడు.
ఇక తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్, ఈ వ్యవహారం గురించి అలీని రివర్స్ ప్రశ్న వేశారు. తానో సీరియస్ ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెప్పిన రేణూ, “మీకు, పవన్ కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?” అని అడిగితే, దానికి అలీ “అయ్యింది” అని సమాధానమిచ్చారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు.
‘జానీ’ చిత్రం షూటింగ్ సమయంలో ముంబైలో పవన్, అలీలతో కలిసెళ్లి పానీపూరీ తిన్న సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘జానీ’, ‘ఖుషీ’ సినిమాలకు తాను ఎడిటింగ్ చేశానని, అందుకు తనకు రూపాయి కూడా ఇవ్వలేదని, అందుకు తన మాజీ భర్త పవనే సాక్ష్యమని అన్నారు. తనకిప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తన పెళ్లిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
స్వరూపానందపై సింగర్ సునీత ఫైర్