నసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. ముందుగా అనుకున్నట్లుగానే పవన్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేసే స్థానాలను పార్టీ మంగళవారంనాడు అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పవన్ పోటీ చేయబోతున్నారు. మంగళవారం ఉదయం జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా భీమవరం, గాజువాక పోటీ చేయాలని సూచించారు. ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా సాగినప్పటికీ రెండో స్థానం విషయంలో స్పష్టత రాలేదు.