telugu navyamedia
క్రీడలు వార్తలు

పంజాబ్ కెప్టెన్ కు స్పెషల్ బర్త్ డే విషెస్…

పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్‌ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు‌. గత మూడు సీజన్లలో టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తూ తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. నేడు పంజాబ్ కెప్టెన్ రాహుల్‌ పుట్టిన రోజు. ఈ క్రమంలో తన గ‌ర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి కూడా విషెస్ చెప్పారు. ఆ విషెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. ‘ఈ ఏడాది గొప్పగా సాగాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకంక్షాలు’ అని ట్వీట్ చేశారు. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అత‌నితో దిగిన ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా స్పందించ‌డం విశేషం. ‘గ్రేట్‌ఫుల్ ఫ‌ర్ యు, హ్యాపీ బ‌ర్త్ డే’ అని అతియా చేసిన పోస్ట్‌పై స్పందిస్తూ.. నిజంగానే అంటూ ఓ బ్లాక్ క‌ల‌ర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ‘మై క్యూటీస్’ అంటూ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా కూడా అతియా పోస్ట్‌పై కామెంట్ చేశాడు. ప్రస్తుతం అతియా చేసిన ట్వీట్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. రాహుల్‌తో దిగిన ఈ ఫొటోలు అతియా ఎప్పుడూ బ‌య‌ట‌పెట్టలేదు. కేఎల్‌ రాహుల్, అతియా శెట్టి ఇద్ద‌రూ ఒక‌రి బ‌ర్త్‌డేల‌కు ఒక‌రు విషెస్ చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ రిలేష‌న్‌షిప్‌పై బ‌య‌ట‌ప‌డ‌లేదు.

Related posts