telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విజయ్ సేతుపతికి .. తిప్పలు తెస్తున్న .. మండి యాప్ యాడ్ ..

mandi ad troubles vijay setupati

సెలబ్రిటీస్ అన్నాక యాడ్స్ చేస్తుంటారు.. అయితే అందులో కొన్ని తిప్పలు కూడా తెస్తుంటాడు. అదే స్థితిలో ఉన్నాడు నటుడు విజయ్‌సేతుపతి. ఆయన ఇంటిని ముట్టడించేందుకు చిరు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్న విజయ్‌ సేతుపతి ఇప్పుడు చిరువ్యాపారుల ఆగ్రహానికి గురవుతున్నారు. అందుకు కారణం ఇటీవల ఆయన ఆన్‌లైన్‌ వ్యాపారం కోసం ఒక వ్యాపార సంస్థ రూపొందించిన మండి యాప్‌లో నటించడమే. ఆ యాప్‌లో చిరు వ్యాపారులకు బాధింపు కలిగేలా కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చునే విధంగా విజయ్‌సేతుపతి నటించారు. దీంతో చిరువ్యాపారులు ఆయన ఆ యాప్‌లో నటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో చిరు వ్యాపార సంఘాలు నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దీనిపై స్పందించిన తమిళనాడు వ్యాపారసంఘల నిర్వాహకులు.. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఏ విషయాన్ని తాము అనుమతించమన్నారు.

అన్‌లైన్‌ వ్యాపారంతో చిరు వ్యాపారులకు చాలా నష్టం ఏర్పడుతుందన్నారు. ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో బడా సంస్థలు చేస్తున్న వ్యాపారం ప్రజలకు చేటుచేస్తుందన్నారు. ఉదాహరణకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని చెప్పే వ్యాపార సంస్థలు ఆ వస్తువులను శీతలీయం పరచి విక్రయిస్తున్నారని చెప్పారు. అలా వంకాయలు, టమాటాలు కూరగాయలు సహజంగా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవన్నారు. అలాంటి వాటిని శీతలీయం పరిచి విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న బడా వ్యాపారులు స్థానిక కోయంబేడు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్న విషయం వెలుగు చూసిందన్నారు. వారిని అడ్డగించి మార్కెట్‌ వ్యాపారులు ఆందోళన చేసినట్లు తెలిపారు. అంతదూరం ఆలోచించలేదని విజయ్ వర్గం స్పందించిందట.

Related posts