telugu navyamedia
క్రీడలు వార్తలు

ఏబీ వెంకటేశ్వరరావు పై మరోసారి క్రమ శిక్షణా చర్యలు.

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలలు చెప్పటింది.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయ‌డం హాట్ టాపిక్‌గా మార‌గా.. ఏబీవీ కామెంట్ల‌కు ఇప్ప‌టికే కౌంట‌ర్ ఇచ్చారు పోలీసులు.. అయితే, ఐపీఎస్‌గా ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై అభియోగాలు మోపింది ఏపీ స‌ర్కార్.. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీవీ చేసిన కామెంట్లని సీరియస్సుగా తీసుకున్న జగన్ సర్కార్.. 30 రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.. ఇప్పటికే నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగంపై స‌స్పెన్ష‌న్‌లో ఉన్నారు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు.

Related posts