telugu navyamedia
రాజకీయ

రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు.. స్వ‌యంగా ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోదీ

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. ప్రముఖ సినీ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, ధర్మస్థల శ్రీ వీరేంద్ర హెగ్గడే ఆ జాబితాలో ఉన్నారు.

వీళ్ల నామినేట్‌ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో స్వయంగా ప్రకటించారు. ఆయా రంగాల్లో వాళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. వాళ్లను రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా వారు అందించిన సేవ‌ల్ని గుర్తు చేసుకుంటూ ప్ర‌ధాని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓక ముద్ర వేశాయని ప్రశింసించారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలిపారు ప్రధాని .

ఇళ‌య‌రాజా సంగీతం అనేక భావాల‌కు ప్ర‌తిబింబ‌మ‌ని…అపబింబ‌మ‌ని..అనేక త‌రాల‌కు అదో వార‌ధిలా నిలిచింద‌ని మోదీ కొనియాడారు. అలాగే పీటీఉష జీవితం..ప్ర‌తీ భార‌తీయుడికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. అనేక ఏళ్లుగా ఎంద‌రో క్రీడాకారుల్ని ఆమె తీర్చిదిద్దార‌న్నారు.

Related posts