telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పటాన్‌చెరులో కోడి పందేలు: 21మంది అరెస్ట్, ప‌రారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌

*ప‌రారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌
*చింత‌మ‌నేని కోసం మూడు బృందాలు ఏర్పాటు..
*గాలింపు చెపట్టిన తెలంగాణ పోలీసులు..
*హైద‌రాబాద్ శివారులో కోడి పందేలు కేసులో
* పీడీ యాక్ట్ న‌మోదు చేస్తామ‌న్న పోలీసులు

పటాన్ చెరు సమీపంలో నిర్వహించిన కోడి పందేల్లో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. పోలీసులు దాడి చేయడంతో ఆయన ప‌రార‌య్యారు. ఆయ‌న‌ కోసం పోలీసులు మూడు బృందాలు విడిపోయి గాలిస్తున్నారు.

హైద‌రాబాద్ సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో చినకంజర్ల శివార్లలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు అందడంతో…అర్ధ‌రాత్రి కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేశారు.

ఘ‌ట‌నా స్థ‌లంలో 21 మందిని అరెస్టు చేశారు. రూ.13.12 లక్షలు, 26 వాహనాలు, 27 ఫోన్లు, 31 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70మంది కోడి పందేలలో పాల్గొన్నారని పటాన్చెరు డిఎస్పీ తెలిపారు.

అయితే విచారణలో .. చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ఈ పందేలు సాగుతున్నాయని ఉన్నారని డిఎస్పీ వెల్లడించారు. అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల రాజు అనే ముగ్గురు నిర్వాహకులను తెలిపారు. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్ తో పాటు చాలా మంది పరారయ్యారని డిఎస్పి పేర్కొన్నారు.

అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించామని డిఎస్పీ వివరించారు.

Related posts