telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ ప్రమాణస్వీకార సభ.. రాత్రి వర్షానికి..

last night rains damage venue of jagan oath

విజయవాడలో అర్ధరాత్రి భీకర గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వేదికపైన వేసిన పరదాలు ఎగిరిపోయాయి.

వర్షపు నీటితో ప్రాంగణమంతా బురదమయంగా మారింది. రాత్రి 1.30 గంటలకు గాలులు, వర్షం తగ్గడంతో.. వైసీపీ పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మైదానంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Related posts