టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడి అధికారం కూడా పోయిందని ట్వీట్ చేశారు.
‘తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.