telugu navyamedia
రాజకీయ

నేడు డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పెళ్ళాడ‌నున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ..

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఈరోజు వివాహం జరగనుంది

నేడు చండీగఢ్‌లోని ఆయన నివాసంలో చాలా తక్కువ మంది కుటుంబ స‌భ్యుల‌ సమక్షంలోనే జరగనుంది. ఈ వివాహ వేడుక‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.

భగవంత్ మాన్ ఆరు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆయన మొదటి భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. భగవంత్ మాన్ పిల్లలిద్దరూ ఇటీవల ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్ భార్య ఇంద్రప్రీత్ కౌర్ కూడా ఆయనతో కలిసి ప్రచారం చేశారు .

కాగా..మ‌రో వివాహం చేసుకోవాలంటూ భగవంత్ మాన్ పై కుటుంబ స‌భ్యులు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తన తల్లి, సోదరి స్వయంగా ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ వివాహం చేసుకోనున్నారు.

భగవంత్ మాన్ , డాక్టర్ గురుప్రీత్ కౌర్ నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. గుర్‌ప్రీత్ 2019లో మన్‌ను కలిశారని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో కలిసి ప్రచారం చేశారని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ఆమె కూడా భగవంత్ మాన్  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు

భగవంత్ మాన్ హాస్యనటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. 2008లో కపిల్ శర్మతో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ అనే టీవీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత భగవంత్‌ మాన్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా పనిచేశారు. కచారి సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన భగవంత్ మాన్ 12 చిత్రాలకు పైగా పనిచేశారు

Related posts