telugu navyamedia
రాజకీయ

బీజేపీలో చేరిన తర్వాత ములాయం ఆశీస్సులు తీసుకున్న‌అపర్ణా యాదవ్. ..

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దెబ్బ త‌గిలింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బుధవారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే.

Mulayam Singh's daughter-in-law Aparna Yadav joins BJP - Social News XYZ

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. అపర్ణ పార్టీ మారిన ఒక రోజు తర్వాత, ములాయం బావ మరియు పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆమె ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్‌ను వివాహం చేసుకుంది. భారతీయ జనతా పార్టీలో చేరిన రెండు రోజుల తర్వాత లక్నో వ‌చ్చిన ఆమె తన మామ‌గారైన ములాయం సింగ్ యాదవ్ ను శుక్రవారం ఉదయం క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె హిందీలో ట్వీట్ చేసింది.

ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి దిగిన ఫోటోను అపర్ణ షేర్‌ చేసింది. అందులో ఆమె ములాయం పాదాలను తాకినట్లు కనిపిస్తుంది. 

Two Days After Joining BJP, 'Chhoti Bahu' Aparna Yadav Seeks Mulayam's  Blessings

“భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత, లక్నో వచ్చినప్పుడు, తండ్రి/నేతాజీ నుండి ఆశీర్వాదం తీసుకున్నాను” అని అపర్ణ తన ట్వీట్‌లో పేర్కొంది.

కాగా..అపర్ణ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణాల్లో లఖ్‌నవూ కంటోన్మెంట్ సీటు కూడా ఒకటి. ఈ సీటు నుంచే పోటీ చేస్తానని మొదట్నుంచీ అపర్ణ భీష్మించుకుని కూర్చున్నారు . అలాగే 2017లో ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై పోటీ చేశారు. అయితే, అపర్ణ ఓడిపోయారు.

ప్రస్తుతం ఈ సీటును తన కుమారుడికి ఇవ్వాలని రీటా డిమాండ్ చేశారు. లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె అన్నారు. కాగా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ‘‘సమాజ్‌వాదీ టికెట్‌పై అపర్ణ పోటీచేసి గెలవడం కష్టం. అదే బీజేపీ టికెట్‌పై పోటీచేస్తే ఆమె తేలిగ్గానే విజయం సాధిస్తారు’’ అని స‌మాచారం.

అయితే  పార్టీ మారకుండా అపర్ణను అడ్డుకునేందుకు తన తండ్రి (ములాయం సింగ్ యాదవ్) తీవ్రంగా ప్రయత్నించారని పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గతంలో చెప్పారు.

Related posts