దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది..రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి 3,47,254 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనాతో 703 మంది మరణించారు. వైరస్ నుంచి 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో ఒమిక్రాన్ సైతం విజృంభిస్తుండంతో కోవిడ్-19 కేసులు రెండు మిలియన్ల మార్కును అధిగమించాయి. యాక్టివ్ కేసులు 20,18,825కి పెరిగాయి, గత 235 రోజుల్లో ఇదే అత్యధికం. రికవరీ రేటు 93.50 శాతానికి పెరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు సంఖ్య 3,85,66,027కు చేరాయి. మరణాల సంఖ్య 488,396కు చేరాయి.
దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం నమోదైన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కు చేరాయి. ఒక్కరోజే సుమారు 4.36 శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 160.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. గురువారం రోజు దేశవ్యాప్తంగా 19,35,912 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లకు చేరింది.