వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం తెల్లవారుజామునలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వివరాల్లోకి వెళితే..
ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్‌లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలులు చెలరేగడంతో భయంతో ప్రయాణికులు ట్రైన్ దిగారు. లోపాన్ని గమనించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు.
ట్రైన్ బ్రేకులు జామ్ కావడంతోనే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది వివరించారు. కాగా గంటకు పైగా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.అయితే ఈ ఘటనలో అదరూ సేఫ్ గా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.