telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఎంపీ, ఎమ్మెల్యేఅభ్యర్థులతో పవన్‌ భేటీ

Janasena pawan comments Jagan

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నేడు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాల్సిందిగా అభ్యర్థులందరికి ఇప్పటికే సమాచారం పంపినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.

ఈ సమావేశంలో పోలింగ్‌ సరళి, ఏయే స్థానాల్లో పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి తదితర అంశాలపై అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. అదే విధంగా ఈనెల 23వ తేదీన జరగనున్న కౌంటింగ్‌ రోజు పార్టీ ప్రతినిధులు ఎలా వ్యవహరించాలన్నదానిపైనా సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

Related posts