telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

లంచం ఇవ్వకుంటే తెలంగాణలో ఏ పని జరగదు: రాహుల్‌

rahul gandhi to ap on 31st
అధికారులకు లంచం ఇవ్వకుంటే తెలంగాణలో ఏ పని జరగడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగడం లేదని రాహుల్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబం భారీగా అవినీతి వ్యాపారం చేస్తోందని ఆయన  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  తెలంగాణకు కాంగ్రెస్‌ ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వ్యాపారం చేయాలనుకునే పేదలకు రుణాలు ఇస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 
మోదీ పాలనలో పేదలకు రుణాలు దక్కడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మోదీ తెచ్చిన జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. పంట పొలాల వద్దే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుతో రైతుల మెరుగైన ధరలు వస్తాయన్నారు. మోదీ ధనికులు, పేదలు అంటూ రెండు రకాల భారతదేశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పేదరికాన్ని అంతం చేయాలనకుంటే మోదీ పేదలనే అంతం చేయాలని చూస్తున్నాడని రాహులు విమర్శించారు. 

Related posts