telugu navyamedia
రాజకీయ

రాష్ట్రపతిగా ఎన్నిక నా వ్యక్తిగత విజయం కాదు, ఇది ఆదివాసీ, దళితుల విజయం

*భార‌త రాష్ర్ట‌ప‌తిగా ద్రౌప‌తి ముర్ము ప్ర‌మాణ‌స్వీకారం
*పార్ల‌మెంట్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీర‌మ‌ణ‌
*రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం
*రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు
*నాపై మీరు ఉంచిన న‌మ్మ‌క‌మే బ‌లం.
*మీ విశ్వాసం నిల‌బెట్టుకునేందుకు కృషి చేస్తా..
*ఇబ్బందులున్నా సంకల్ప బలంతో ముందుకెళ్లాలి..
*వార్డు కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చా..

నాపై మీరు ఉంచిన నమ్మకమే నా బలమని ద్రౌపదీ ముర్ము అన్నారు. ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సంద‌ర్భంగా దేశ ప్రజలకు కార్గిల్‌ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ర్ట‌ప‌తి ఎన్నుకున్న దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి .మీ విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తాన‌ని ద్రౌప‌తి మ్ముర్ము అన్నారు.

Poor Can Dream President Druapadi Murmu In Her First Speech - Sakshi

ఎన్ని ఇబ్బందులున్నా సంకల్పంతో ముందుకెళ్లాలని ద్రౌపది ముర్ము అన్నారు. వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలన్నారు. ఒకప్పుడు చదువుకోవడం నా కల.. ఇప్పుడు రాష్ట్రపతి అయ్యాను అని అన్నారు.

ఆదివాసీ గ్రామం నుంచి నా ప్రయాణం మొదలైందని అన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలికగా నేనేనని అన్నారు.

ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రపతిగా ఎన్నిక కావడం నా వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమన్నారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా అని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా ఆమె ప్రసంగించారు.

Related posts