telugu navyamedia
క్రైమ్ వార్తలు

డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని ఘోర ప్రమాదం..8 మంది మృతి..20 మందికిపైగా యాలుయాలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు డబుల్ డెక్కర్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో 8 మంది ప్రయాణికులు చనిపోగా, మరో 20 మందికిపైగా cయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని సీహెచ్‌సీ హైదర్‌ఘర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు

ఈ ఘ‌ట‌న బారాబంకి జిల్లాలో లోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నారాయణ్ పూర్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోన ప్రమాదం జరిగింది.

రెండు వాహనాలు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపూర్ మద్రాహా గ్రామ సమీపంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల పలు ఎక్స్ ప్రెస్ వేలు అందుబాటులోకి రాగా, వాటిలో అతి పెద్దదిగా ప్రత్యేకంగా నిలుస్తుంది పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే. 341 కిలోమీటర్ల ఈ రహదారి దాదాపు 10 జిల్లాలను కలుపుతూపోతుంది.

మరోవైపు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.

త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరామున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు.

Related posts