telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

భూకంపంతో అల్లాడిన అలాస్కా..రిక్టర్ స్కేలుపై 7.8గా తీవ్రత నమోదు

earth quake alaska

అమెరికాలోని అలాస్కా పీఠభూమిని బుధవారం భారీ భూంకంపం కుదిపేసింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. అలస్కాలోని చిగ్నిక్‌కి దక్షిణాన 75 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భూకంపం కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర తీర ప్రాంతాల్లోని వారితోపాటు దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా అలలు దూసుకువచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Related posts