telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళా భద్రత బిల్లుకు ఆమోదం!

AP assembly special status discussion

ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా భద్రత బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్‌ లా చట్టం 2019 సవరణ బిల్లుకు మంత్రి వర్గం అనుమతిని తెలిపింది. అత్యాచార ఘటనకు సంబంధించి నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు వారం రోజుల్లోగా దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు చేపట్టనున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.

Related posts