telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బీబీ3 సినిమాలో విలన్ గా పూర్ణ…?

Poorna

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ప్రేక్షకులు ఏ స్థాయి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే తనకు రెండు బ్లాక్ బస్టర్లు అందించిన బోయపాటితో మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా బీబీ3గా ప్రచారం అవుతుంది. ఈ సినిమాపై అభిమానులు తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పుడు సొసైల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే… ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకురాలిగా హీరోయిన్ పూర్ణ నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పూర్ణతో డాక్టర్ రోల్ అని తెలుస్తుంది. కానీ ఈ విషయానికి సంభందించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఫైనల్ కాలేదు. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో పేర్లు వెలుగు చూశాయి. మోనార్కా, ధర్మా వంటి పేర్లు ఈ సినిమాకు ఫైనల్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు సినిమా టైటిల్‌పై కూడా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో చూడాలి. ఈ సినిమా మే28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts