telugu navyamedia
రాజకీయ

మోదీ గెలిస్తేనే కశ్మీర్‌ అంశంపై శాంతి చర్చలు: ఇమ్రాన్‌ ఖాన్‌

Pak people attack pak poilet
భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీనీ గెలిస్తేనే కశ్మీర్‌ అంశంపై శాంతి చర్చలకు ఆస్కారం ఉంటుందని ఇమ్రాన్‌ అభిప్రాయపడ్డారు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే, కశ్మీర్‌ అంశంపై శాంతి చర్చలు నిర్వహించేందుకు ఆ పార్టీ భయపడుతుందని ఇమ్రాన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. విదేశీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 
భారతీయ ముస్లింలు తనకు చాలా ఏళ్ల నుంచి తెలుసని, ఇన్నాళ్లూ వారంతా సంతోషంగానే ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ ముస్లింలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చిందన్నారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్‌ అన్నారు. కశ్మీర్‌ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్‌ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారన్నారు. తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్‌కు అవసరమన్నారు. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌, భారత్‌ మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. 

Related posts