telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ అభ్యర్థికి గ్రీన్‌ కార్డు సమస్య.. నామినేషన్ దాఖలు పై చిక్కులు

shabana khatoon

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షబానా ఖాతూన్ నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్లకు సోమవారం ఆఖరి తేదీ కావడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. చివరి నిముషంలో చేసిన తప్పు బయటపడటంతో ఏమి చేయాలో టీడీపీ అధిష్టానానికి అర్థం కావడం లేదు. ఎంఎల్ఏ జలీల్ ఖాన్ ఆయన కూతురు షబానా ఖాతూన్. మొన్నటి వరకూ అమెరికాలో ఉండేవారు. అమెరికాలో ఉన్న కుమార్తెను తండ్రి జలీల్‌ఖాన్ ఇటీవలే ఇండియాకు రప్పించారు.

కేవలం విజయవాడలో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే షబానా అమెరికా నుండి విజయవాడకు వచ్చారు. ఎంతో ఆర్భాటంగా నామినేషన్ కూడా వేశారు. ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన కాలం పాటు అక్కడ ఉన్న వారికి గ్రీన్‌ కార్డు మంజూరు చేస్తుంది. ఆమెకు ఉన్న అమెరికా గ్రీన్ కార్డ్ రద్దు కాకపోవడంతో షబానా అమెరికా పౌరులుగానే పరిగణింపబడతారు. దీంతో ఆమె నామినేషన్‌పై టీడీపీ నేతలు డైలమాలో పడిపోయారు. గ్రీన్ కార్డు రద్దు కోసం టీడీపీ అభ్యర్థి షబానా ఇన్ని రోజులు నామినేషన్ వేయకుండా ఉన్నారు. షబానా నామినేషన్ చెల్లకపోతే ఎవరికి సీటివ్వాలన్న ఆలోచనలో టీడీపీ పడింది.

Related posts